Thiruveer: ఓ ఇంటివాడైన నటుడు తిరువీర్‌.. ఫొటోలు చూశారా!

నటుడు తిరువీర్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

Published : 21 Apr 2024 22:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మసూద’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్‌ (Thiruveer) ఓ ఇంటివాడయ్యారు. కల్పనా రావు అనే యువతిని ఆయన వివాహమాడారు. ఇరు కుటుంబాలు, కొద్దిమంది బంధువుల సమక్షంలో వారివురు మూడు ముళ్ల బంధంతో ఆదివారం ఒక్కటయ్యారు. ‘కొత్త ఆరంభం..’ అంటూ హల్దీ వేడుక, పెళ్లి ఫొటోలను తిరువీర్‌ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

థియేటర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని ప్రారంభించిన తిరువీర్‌ 150కిపైగా ప్రదర్శనలిచ్చారు. ‘బొమ్మల రామారం’లోని చిన్న పాత్రతో తెరంగేట్రం చేశారు. తర్వాత ‘ఘాజీ’, ‘ఏమంత్రం వేశావే’, ‘మల్లేశం’లోనూ నిడివి తక్కువ పాత్రలకే పరిమితమయ్యారు. ‘జార్జ్‌రెడ్డి’లో నెగెటివ్‌ రోల్‌, ‘పలాస 1978’లో సపోర్టింగ్‌ క్యారెక్టర్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మసూద’తో క్రేజ్‌ను పెంచుకున్నారు. ఇటీవల హీరోగా సోషియో ఫాంటసీ చిత్రాన్ని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని