Trisha: న్యాయ పోరాటానికి దిగిన త్రిష.. ఏఐఏడీఎంకే మాజీ నేతపై పరువు నష్టం దావా

Trisha తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐఏడీఎంకే మాజీ నేత రాజుపై త్రిష పరువునష్టం దావా వేశారు.

Published : 22 Feb 2024 13:28 IST

చెన్నై: తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐఏడీఎంకే మాజీ నాయకుడు ఏవీ రాజుపై త్రిష (Trisha) న్యాయపోరాటానికి దిగారు. ఈ మేరకు పరువునష్టం దావా వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్‌ వేదికగా సదరు వివరాలను పంచుకున్నారు. ఇటీవల మీడియా సమావేశంలో ఏవీ రాజు మాట్లాడుతూ.. త్రిషను ఉద్దేశించిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వార్తలు, వీడియోలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అయ్యాయి. రాజు వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు త్రిషకు మద్దతుగా నిలిచారు.

ఈ క్రమంలో త్రిష స్పందిస్తూ అటెన్షన్‌ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని పదే పదే చూస్తుండడం అసహ్యంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఇకపై తాను ఇచ్చే సమాధానం లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచే వస్తుందని హెచ్చరించారు. అన్నట్లుగానే భారీ మొత్తం నష్టపరిహారంగా చెల్లించాలంటూ లీగల్‌ నోటీసులు పంపారు.

ఎమ్మెల్యే జి.వెంకటాచలాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన రాజు.. త్రిష వ్యక్తిగత జీవితంపైనా కామెంట్‌ చేశారు. కెరీర్‌ ప్రారంభించి 20 ఏళ్లకుపైనే అయినా స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారామె. గతేడాది మూడు చిత్రాలతో అలరించి, ఇప్పుడు ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ నేపథ్యంలో దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. ‘స్టాలిన్‌’ తర్వాత చిరంజీవి సరసన త్రిష నటిస్తున్న చిత్రమిదే కావడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని