Yash: రాఖీభాయ్‌ లుక్‌లో యశ్‌.. కేజీఎఫ్‌3 కోసమేనా?

కన్నడ నటుడు యశ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ వీడియో వైరల్‌ అవుతోంది.

Published : 28 Mar 2024 19:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ నటుడు యశ్‌ ‘కేజీఎఫ్‌’ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా ఆదరణ పొందారు. ఆయన చేయబోయే సినిమాల అప్‌డేట్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఆయన నటిస్తున్న కొత్త చిత్రంపై అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా యశ్ తన సినిమాకి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘తప్పించుకోలేని ప్రశ్నలు నన్ను ఆశ్చర్యపరిచాయి. శక్తిమంతమైన దానికోసం వేచి ఉండండి’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. అందులో రాఖీభాయ్‌గా యశ్‌ అతను ముందు కొందరు విలేకర్లు చర్చలు జరుపుతున్నారు. కమింగ్‌ సూన్‌ అని వీడియో ముగుస్తుంది. దీంతో త్వరలో ‘కేజీఎఫ్‌3’ సినిమా అప్‌డేట్‌ ఇవ్వనున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు యశ్‌ ‘టాక్సిక్‌’లో నటిస్తున్నారు. ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌.. అన్నది ఉప శీర్షిక. మలయాళ దర్శకురాలు గీతూమోహన్‌ దాస్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు.  భారీ బడ్జెట్‌తో కె.వి.ఎన్‌.ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇందులో కథానాయికగా సాయిపల్లవి, కియారా అడ్వాణీ, శృతిహాసన్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ యశ్‌ సోదరి పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై చిత్రబృందం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని