Anjali: రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’.. తన పాత్ర గురించి చెప్పిన అంజలి

తన కొత్త సినిమా (గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, గేమ్‌ ఛేంజర్‌)ల గురించి నటి అంజలి పలు విశేషాలు పంచుకున్నారు.

Updated : 26 May 2024 16:30 IST

హైదరాబాద్‌: తాను నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమా గురించి ఎన్నో విషయాలు చెప్పాలనుందని, కానీ ఏ అప్‌డేట్‌ అయినా దర్శక, నిర్మాతలు ఇస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో మాట్లాడడం లేదని అంజలి (Anjali) అన్నారు. తన మరో సినిమా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari) త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఆమె విలేకర్లతో ఆదివారం ముచ్చటించారు. విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) హీరోగా తెరకెక్కిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’లో తాను రత్నమాలగా కనిపిస్తానని, అదొక విభిన్నమైన పాత్రని తెలిపారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ గురించి ప్రశ్న ఎదురవగా స్పందించారు.

‘‘గేమ్‌ ఛేంజర్‌లో నేను కీ రోల్‌కే పరిమితం కాదు. అందులో నేనో హీరోయిన్‌. ఈ సినిమాలో నేను క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కనిపిస్తానని మేకర్స్‌ ప్రకటించలేదు కదా. నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రానంత వరకు అన్నీ రూమర్సే. ఈ చిత్రంలో హీరోయిన్‌ కియారా అడ్వాణీ, అంజలి ఓ పాత్ర పోషిస్తుందని చాలామంది అనుకుంటున్నారు. అది గాసిప్‌. నా పాత్రకు సంబంధించి ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌, ఓ అందమైన పాట ఉంటాయి. ఇంతకుమించి ఏం చెప్పలేను’’ అని అంజలి అన్నారు.

రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమే ‘గేమ్‌ ఛేంజర్‌’. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 1960ల నాటి గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే కథాంశంతో దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ఈ నెల 31న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని