Aparna Das: వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్‌

‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్‌, ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ నటుడు దీపక్‌ పరంబోల్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

Published : 24 Apr 2024 10:18 IST

ఇంటర్నెట్‌డెస్క్: ‘ఆదికేశవ’తో తెలుగువారికి సుపరిచితురాలైన నటి అపర్ణాదాస్‌ (Aparna Das). హీరో సోదరి పాత్రలో నటించి, ఇక్కడి ప్రేక్షకులను అలరించారు. తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’తో ఇటీవల విజయాన్ని అందుకున్న మలయాళీ నటుడు దీపక్‌ పరంబోల్‌తో ఆమె ఏడడుగులు వేశారు. కేరళలోని గురువాయూర్‌ దేవాలయంలో బుధవారం ఉదయం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

‘నాన్‌ ప్రకాశన్‌’తో నటిగా తెరంగేట్రం చేశారు అపర్ణాదాస్‌. 2019లో విడుదలైన ‘మనోహరమ్‌’ హీరోయిన్‌గా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే దీపక్‌ పరంబోల్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి.. పెద్దల అంగీకారంతో ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. 2023లో విడుదలైన ‘డాడా’ అపర్ణాదాస్‌ కెరీర్‌లో సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె మలయాళంలో తెరకెక్కుతోన్న ‘ఆనంద్‌ శ్రీబాల’ కోసం వర్క్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని