Vasanthi Krishnan: బిగ్‌బాస్‌ ఫేమ్‌ వాసంతి నిశ్చితార్థం.. వీడియో వైరల్‌

బుల్లితెర నటి వాసంతి కృష్ణన్‌ (Vasanthi Krishnan) వివాహం త్వరలో జరగనుంది. తాజాగా ఆమె నిశ్చితార్థం జరిగింది.

Published : 08 Dec 2023 13:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 6’లో పాల్గొన్న నటి వాసంతి కృష్ణన్‌ (Vasanthi Krishnan) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. తన మిత్రుడు పవన్‌కల్యాణ్‌తో ఆమె త్వరలో ఏడడుగులు వేయనున్నారు. తిరుపతిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం వీరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులతోపాటు పలువురు బుల్లితెర నటీనటులు ఈ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. కాబోయే వధూవరులకు అభినందనలు తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తెలుగులో పలు ధారావాహికల్లో నటించిన ఆమె కన్నడ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని