Adah Sharma Gets Trolled: ఆ సినిమా చేసినందుకు వేశ్య అని ట్రోల్‌ చేశారు: అదా శర్మ

‘బస్తర్‌’ సినిమా అంగీకరించినందుకు తనను ట్రోల్‌ చేశారని నటి అదాశర్మ అన్నారు.

Updated : 23 Mar 2024 16:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలాంటి కథలకైనా ధైర్యంగా ఓకే చెబుతూ వరుస సినిమాలు చేస్తున్నారు నటి అదాశర్మ (Adah Sharma). తాజాగా ‘బస్తర్‌’ తో పలకరించారు. ఈ సినిమాను అంగీకరించినందుకు కొందరు తనను దారుణంగా ట్రోల్‌ (Social Media Trolls) చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సోషల్‌ మీడియాలో ఆమె ఏ పోస్ట్‌ పెట్టినా కామెంట్స్‌ మాత్రం ఈ చిత్రాన్ని ఉద్దేశించి ఉంటున్నాయని అసహనం వ్యక్తంచేశారు.

‘‘బస్తర్‌’ (Bastar) మూవీ ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేసిన సమయానికి నన్ను ఎంపిక చేయలేదు. పోస్టర్‌లో నా ఫొటో కూడా లేదు. అడవిని చూపించి పేరును ప్రకటించారంతే. అందులో నటించేదెవరో కూడా వెల్లడించలేదు. అప్పటికే నేను ఈ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు రావడంతో నన్ను టార్గెట్‌ చేస్తూ కామెంట్స్‌ చేయడం ప్రారంభించారు. ‘ది కేరళ స్టోరీ’ సమయంలోనూ కొందరు సినిమా చూడకుండానే దాని గురించి మాట్లాడారు. కామెంట్స్‌ చేసే స్వేచ్ఛ మీకు ఉన్నట్లే.. ‘బస్తర్’ (Bastar) లాంటి సినిమా తీసే హక్కు మాకు ఉంటుంది. ఈవిషయాన్ని ఎందుకు అర్థం చేసుకోరు? ఈ చిత్రంలో నేను నటిస్తున్నానని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి నాపై నెగెటివ్‌ కామెంట్స్‌ ఎక్కువయ్యాయి. నేను అందంగా ఉన్న పువ్వుల ఫొటో పెట్టినా దానికి ఇబ్బందికరమైన కామెంట్స్‌ చేస్తున్నారు. వేశ్య వంటి పదాలను వాడుతూ ట్రోల్‌ చేస్తున్నారు’ అని అన్నారు.

అదా శర్మ ప్రధాన పాత్రలో సుదీప్తోసేన్‌ తెరకెక్కించిన చిత్రమే ‘బస్తర్‌’ (Bastar). ది నక్సల్‌ స్టోరీ అనేది ఉపశీర్షిక. విపుల్‌ అమృత్‌లాల్‌ షా నిర్మించారు. మార్చి 15న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని