Adipurush: ‘ఆదిపురుష్‌’ డైలాగ్స్‌.. ఆనాటి లక్ష్మణుడి పాత్రధారి ఆగ్రహం

‘ఆదిపురుష్‌’ (Adipurush)లోని డైలాగ్స్‌పై ‘రామాయణ్‌’ ధారావాహికలోని లక్ష్మణుడి పాత్రధారి సునీల్‌ లహ్రీ (Sunil Lahri) ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని చిత్రాన్ని తెరకెక్కించి ఇలాంటి సంభాషణలు ఉపయోగించడం సిగ్గుచేటు అన్నారు.

Published : 18 Jun 2023 02:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన ‘రామాయణ్‌’ ధారావాహికలో లక్ష్మణుడిగా నటించి ఆనాడు ప్రశంసలు అందుకున్న నటుడు సునీల్‌ లహ్రీ (Sunil Lahri)  ‘ఆదిపురుష్‌’పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆదిపురుష్‌’ (Adipurush) టీజర్‌ విడుదలైన నాటి నుంచి తటస్థంగా మాట్లాడిన ఆయన.. తాజాగా సినిమాలో ఉపయోగించిన భాషను తప్పుబడుతూ పోస్ట్‌ పెట్టారు. ఈ మేరకు సినిమాలోని పలు సన్నివేశాల్లో హనుమంతుడి, రావణాసురుడి డైలాగ్స్‌ను కోట్‌ చేస్తూ.. ‘‘రామాయణాన్ని ఆధారంగా చేసుకునే ‘ఆదిపురుష్‌’ తెరకెక్కిస్తున్నామని చెప్పిన వాళ్లు ఇలాంటి సంభాషణలు ఉపయోగించడం నిజంగా సిగ్గుచేటు’’ అని అన్నారు.

‘ఆదిపురుష్‌’లోని డైలాగ్స్‌పై ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది. హిందీ వెర్షన్‌లోని కొన్ని సంభాషణలు మర్యాదపూర్వకంగా లేవంటూ ఇప్పటికే పలువురు నెటిజన్లు, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి సంభాషణలు ఎలా ఉపయోగించారంటూ మండిపడ్డారు. ఇదే విషయంపై చిత్ర డైలాగ్‌ రైటర్‌ మనోజ్ ముంతాషిర్ శుక్లా స్పందించారు. తాను ఎంతో శ్రద్ధ పెట్టి డైలాగ్స్‌ రాసినట్లు చెప్పారు. పాత్రల మధ్య వ్యత్యాసం చూపించడం కోసమే డైలాగ్స్‌ను సరళీకరించానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని