Adipurush: ‘ఆదిపురుష్’ డ్రాగన్ సీన్ రీక్రియేట్.. వావ్ అంటున్న నెటిజన్లు
ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తోన్న భారీ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌లోని డ్రాగన్ సన్నివేశాన్ని ఓ నెటిజన్ రీక్రియేట్ చేశాడు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.
హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ (Adipurush). చిత్రబృందం అయోధ్యలో భారీ ఈవెంట్‌ను ఏర్పాటుచేసి ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్2న విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అది ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్‌ను కూడా నిరాశకు గురిచేసింది. ‘ఇది సినిమా టీజరా.. బొమ్మల సినిమానా..’ అంటూ కొందరు ట్రోల్ చేశారు. తాజాగా ఆదిపురుష్ గ్రాఫిక్స్‌కు సంబంధించి ఓ వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. టీజర్‌లో సైఫ్ అలీఖాన్ డ్రాగన్‌పై వచ్చే సన్నివేశాన్ని ప్రకాష్ అనే వ్యక్తి రీక్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.
ప్రకాష్ తన ఇన్‌స్టాగ్రాంలో ఆదిపురుష్‌లోని డ్రాగన్ సీన్‌ను తాను ఎడిట్ చేశానంటూ వీడియో పోస్ట్ చేశాడు. అది చూసిన వాళ్లంతా సినిమాలో వీడియో కంటే ఇదే బాగుందని తనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ‘నీ నంబర్‌కు ఆదిపురుష్ డైరెక్టర్ నుంచి త్వరలోనే ఫోన్ వస్తుందని’ ఒకరంటే.. ‘సినిమాలో గ్రాఫిక్స్ కంటే మీరు చేసింది వందశాతం బాగుందని’ మరొకరు కామెంట్ చేశారు. ‘ఆదిపురుష్ టీం కోట్లు ఖర్చుపెట్టి నెలలపాటు తీసిన దాన్ని నువ్వు ఒక్క రాత్రిలో చేసేశావు ఏదేమైనా నువ్వు గ్రేట్’ అంటూ వీడియో చూసిన వాళ్లంతా ప్రశంసిస్తున్నారు. ఇక ఇటీవల ఆదిపురుష్ సినిమాను విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జూన్16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
NATO: తుర్కియే గ్రీన్ సిగ్నల్... నాటో కూటమిలోకి ఫిన్లాండ్!
-
Movies News
Pathaan: ‘బేషరమ్ రంగ్’ వివాదం.. ఇప్పుడు స్పందించిన దర్శకుడు.. ఏమన్నారంటే?
-
Politics News
Yediyurappa: వరుణ నుంచి కాదు.. నా సీటు నుంచే విజయేంద్ర పోటీ: యడియూరప్ప క్లారిటీ!
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!
-
India News
Bhagwant Mann: అమెరికాలో భగవంత్ మాన్ కుమార్తెకు బెదిరింపులు..?
-
Movies News
Aditya Om: ఇంకా బతికే ఉన్నారా? అని కామెంట్ చేసేవారు: ఆదిత్య ఓం