Adipurush: ఓటీటీలోకి ‘ఆదిపురుష్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

ప్రభాస్‌ - ఓం రౌత్‌ల కాంబోలో వచ్చిన ‘ఆదిపురుష్‌’ (Adipurush) ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Updated : 11 Aug 2023 11:14 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా ఓం రౌత్‌ (Om raut) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్‌’ (Adipurush). భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. విడుదల సమయంలో నిత్యం వార్తల్లో నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఎలాంటి ప్రచారం లేకుండా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో గురువారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇందులో ప్రభాస్‌ రాముడిగా కనిపించగా జానకి పాత్రలో కృతిసనన్‌ (Kriti Sanon) అలరించింది.

ఓటీటీలోకి సరికొత్త రాజకీయ చిత్రం.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

క‌థేంటంటే: రామాయ‌ణంలోని కొన్ని ప్ర‌ధాన ఘ‌ట్టాల ఆధారంగా రూపొందిన చిత్ర‌మిది. రాఘ‌వ (ప్ర‌భాస్‌) వ‌న‌వాసం స్వీక‌రించ‌డం నుంచి క‌థ ప్రారంభం అవుతుంది. త‌న అర్ధాంగి, అపురూప సౌంద‌ర్య‌వ‌తి అయిన జాన‌కి (కృతిస‌న‌న్‌), సోద‌రుడు శేషు (స‌న్నీసింగ్‌)తో క‌లిసి స‌త్యం, ధ‌ర్మ‌మే త‌న ఆయుధంగా వ‌న‌వాసం గ‌డుపుతుంటాడు. శ‌త్రు దుర్భేద్యమైన లంకని ఏలుతున్న లంకేశ్ (సైఫ్ అలీఖాన్‌) త‌న సోద‌రి శూర్ప‌ణ‌ఖ చెప్పిన మాటలు విని జాన‌కిని అప‌హ‌రిస్తాడు. త‌న జాన‌కిని తిరిగి తీసుకొచ్చేందుకు రాఘ‌వ ఏం చేశాడు?(Adipurush On OTT).. ఆ పోరాటంలో చెడుపై మంచి ఎలా గెలిచింద‌న్న‌ది మిగ‌తా క‌థ‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని