Siddharth - Aditi Rao Hydari: వివాహ బంధంలోకి సిద్ధార్థ్‌ - అదితి రావు

నటుడు సిద్ధార్థ్‌ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. 

Updated : 27 Mar 2024 19:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు సిద్ధార్థ్‌ (Siddharth).. తన ప్రియురాలు, నటి అదితి రావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో బుధవారం ఉదయం వీరి పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, అతి తక్కువ మంది బంధువులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సినీ ప్రముఖుల కోసం త్వరలోనే విందు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. అయితే, పెళ్లి విషయంలో ఇరు వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అజయ్‌ భూపతి తెరకెక్కించిన ‘మహా సముద్రం’ కోసం సిద్ధార్థ్‌, అదితి తొలిసారి కలిసి వర్క్‌ చేశారు. ఆ సినిమా షూట్‌లోనే వీరి మధ్య స్నేహం కుదిరింది. ‘మహాసముద్రం’ తర్వాత కలిసి ఫంక్షన్స్‌, పార్టీలకు హాజరయ్యారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం సాగింది. ఆయా కథనాల్లో ఎలాంటి నిజం లేదని.. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని పలు సందర్భాల్లో ఈ జంట క్లారిటీ ఇచ్చింది. తాజాగా పెళ్లిపై వార్తలు రావడంతో సిద్ధార్థ్‌ అభిమానులు కంగ్రాట్స్‌ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో అదితి రావు ఒకరు. అందుకే ఆమె ఆ సంస్థానానికి చెందిన దేవాలయంలో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. సిద్ధార్థ్‌కు ఇది రెండో వివాహం. గతంలో మేఘన అనే మహిళతో పెళ్లి జరిగింది. 2007లో వీరిద్దరూ విడిపోయారు. అదితికి కూడా ఇది రెండో వివాహమే. గతంలో సత్యదీప్‌ మిశ్రాతో వివాహం కాగా.. 2012లో విడాకులు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని