Siddharth: అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్‌ చేసిన సిద్ధార్థ్‌

నటుడు సిద్ధార్థ్‌ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు.

Updated : 28 Mar 2024 16:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై నటుడు సిద్ధార్థ్‌ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) తాజాగా స్పందించారు. నిశ్చితార్థం జరిగినట్లు చెప్పారు. అదితితో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేస్తూ.. ‘‘ఆమె ఎస్‌ చెప్పింది. ఎంగేజ్డ్‌’’ అని పేర్కొన్నారు. అదే ఫొటోని ఇన్‌స్టాలో పంచుకున్న ఆమె.. ‘‘అతడు ఎస్ చెప్పాడు’’అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు సినీ తారలు, నెటిజన్లు స్పందించారు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

అజయ్‌ భూపతి తెరకెక్కించిన ‘మహా సముద్రం’ కోసం సిద్ధార్థ్‌, అదితి తొలిసారి కలిసి వర్క్‌ చేశారు. ఆ సినిమా షూట్‌లోనే స్నేహం కుదిరింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం సాగింది. ఆ కథనాల్లో ఎలాంటి నిజం లేదని.. తాము స్నేహితులం మాత్రమేనని పలు సందర్భాల్లో ఈ జంట క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో బుధవారం ఉదయం వీరి పెళ్లి జరిగిందని కథనాలు చక్కర్లు కొట్టాయి. పెళ్లి కారణంగానే అదితి తన తదుపరి చిత్రం ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’ ఈవెంట్‌కూ హాజరు కాలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని