‘ఆడియన్స్‌ ఈ ప్రశ్న నన్ను అడగలేదు’.. సిద్ధార్థ్‌తో రిలేషన్‌పై విలేకరి ప్రశ్నకు అదితి రియాక్షన్‌

‘మహా సముద్రం’ విడుదలైన నాటి నుంచి సిద్ధార్థ్‌ - అదితి రావు హైదరీ (Aditi Rao Hydari ) ప్రేమలో ఉన్నట్లు ఎన్నో సార్లు వార్తలు వచ్చాయి. ఇటీవల కాలంలో వీరిద్దరూ కలిసి ఫంక్షన్స్‌కు హాజరు కావడం ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆయా వార్తలపై అదితి స్పందించారు.

Updated : 23 Mar 2023 12:25 IST

హైదరాబాద్‌: తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై వస్తోన్న వార్తల గురించి నటి అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) స్పందించారు. అలాంటి విషయం ఏదైనా ఉంటే తానే అందరితో చెబుతానని అన్నారు. ‘తాజ్‌’ (TAJ) సక్సెస్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్‌తో రిలేషన్‌ గురించి వస్తోన్న రూమర్స్‌పై స్పందించమని విలేకరి కోరగా అదితి కాస్త విభిన్నంగా బదులిచ్చారు. ప్రేక్షకులు ఎవరూ తనని ఇలాంటి ప్రశ్నలు అడగలేదని అన్నారు.

‘‘ఒకవేళ అందరితో పంచుకోవాల్సిన విషయం ఏదైనా ఉంటే.. నేనే తప్పకుండా చెబుతా. ప్రతి ఒక్కరికీ ఏదో ఒకదానిపై ఆసక్తి ఉంటుంది. కొంతమందికి ఇలాంటి విషయాలపై ఉండొచ్చు కానీ, చాలా మందికి మమ్మల్ని స్క్రీన్‌పై చూడటమంటేనే ఇష్టం. అందుకు అనుగుణంగా మేము మరింత కష్టపడి పనిచేయాలి. మా పనిని ప్రేమించాలి. అలా చేసినప్పుడే మీకు మంచి కంటెంట్‌ను అందించగలం. అదే మాకు ముఖ్యం’’ అని ఆమె చెప్పారు.

అనంతరం విలేకరి సిద్ధార్థ్‌తో డేటింగ్‌ వార్తలపై స్పందించమని కోరగా.. ‘‘మీకే ఒక అభిప్రాయం ఉంది. ఇంక నేనేమి చెబుతా. ఒకవేళ నేను ఏం చెప్పినా మీకు నచ్చిన విధంగా ఊహించుకుంటారు’’ అని కాస్త అసహనంగా ఆమె బదులిచ్చారు. దీంతో విలేకరి.. ‘‘ఇది ఆడియన్స్‌ ప్రశ్న మేడమ్‌’’ అని అనగా.. ‘‘ఆడియన్స్‌ ఎవరూ నన్ను ఇలాంటి ప్రశ్న అడగలేదు. మీరే నన్ను అడిగారు’’ అని నవ్వుతూ చెప్పి ఇంటర్వ్యూ పూర్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని