Aditi Rao Hydari: బిబ్బోజాన్‌కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు

‘బిబ్బోజాన్‌కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’లోని అదితీరావ్‌ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్‌బృందం.

Updated : 18 Apr 2024 11:59 IST

‘బిబ్బోజాన్‌కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’లోని అదితీరావ్‌ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్‌బృందం. వేశ్యావృత్తితో సమాంతర వ్యవస్థను నడుపుతున్న కొంతమంది మహిళల జీవిత కథే ఈ సిరీస్‌. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌ను సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారు. ఈమె, మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఇందులోని అదితి పోషించిన బిబ్బోజాన్‌ పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను పంచుకుంది సిరీస్‌బృందం. ‘మచ్చలేని నా అందం, గజ్జెలు ధరించి నా కాళ్లు చేసే సంగీతం గురించే వారు మాట్లాడతారు. మాతృభూమి కోరుకునే స్వేచ్ఛకోసం అందాన్ని ఆయుధంగా ఉపయోగించుకునే కళ కూడా ఈ బిబ్బోజాన్‌కి తెలుసు’ అనే వ్యాఖ్యలతో ఉన్న వీడియోలో అదితి అందం ఆకట్టుకుంటోంది. మే 1న ఈ సిరీస్‌ విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని