Ahimsa: సైలెంట్‌గా ఓటీటీలోకి ‘అహింస’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా పరిచయమైన సినిమా ‘అహింస’ (Ahimsa). తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది.

Updated : 05 Dec 2023 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం ‘అహింస’. జూన్‌ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon prime) వేదికగా ప్రసారమవుతోంది. ఇందులో గీతికా తివారీ కథానాయికగా నటించగా..  రజత్‌ బేడీ, సదా, రవి కాలే, కమల్‌ కామరాజు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం అందించారు.

కథేంటంటే: రఘు (అభిరామ్‌ దగ్గుబాటి), అహల్య (గీతికా తివారీ) బావామరదళ్లు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరుగుతుంది. అదే రోజు అహల్యపై అత్యాచారం చోటు చేసుకుంటుంది. దీంతో ఆ అఘాయిత్యానికి పాల్పడిన వారిపై న్యాయ పోరాటానికి దిగుతాడు రఘు. అతడికి న్యాయవాది లక్ష్మి (సదా) అండగా నిలుస్తుంది. మరి ఈ పోరాటంలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి. చివరికి గెలుపు ఎవరిది? అహింసావాదాన్ని నమ్మే రఘు ఈ పోరాటంలో విజయం సాధించాడా? లేదా? అనేది కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని