Aishwarya Lekshmi: అతడి ప్రవర్తన నన్ను భయపెట్టింది.. ‘అమ్ము’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
‘గార్గి’ లాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని, సమాజంలో జరుగుతోన్న పలు సంఘటనల పట్ల అలాంటి చిత్రాలు అవగాహన కల్పిస్తాయని నటి ఐశ్వర్య లక్ష్మి అన్నారు.
హైదరాబాద్: ‘అమ్ము’తో (Ammu) మంచి విజయాన్ని అందుకుని, తెలుగువారికి చేరువైన కేరళ భామ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi). ప్రస్తుతం ఆమె ‘మట్టి కుస్తీ’ (Matti Kusthi) ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఓ తమిళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. చిన్నప్పుడు తనతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని, ఇప్పటికీ ఆ చేదు ఘటన తనకు గుర్తుందన్నారు.
‘‘ప్రతి అమ్మాయి తన జీవితంలో ఏదో ఒకరకంగా ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొంటుంది. మన సమాజంలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. చిన్నప్పుడు గురువాయుర్ ఆలయంలో నేను ఇలాంటి ఘటనే ఎదుర్కొన్నాను. అక్కడ ఓ వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నాకెంతో భయం వేసింది. ఆరోజు నేను పసుపు రంగు దుస్తులు వేసుకున్నాను. ఆ ఘటన తర్వాత పసుపు రంగు చూస్తేనే చాలా భయం వేసేది. ఆ ఘటన ఇప్పటికీ నాకు గుర్తుంది. ఇటీవల సినిమా ప్రమోషన్స్ కోసం కోయంబత్తూర్‌కు వెళ్లినప్పుడు కూడా ఇలాంటి ఘటననే ఎదుర్కొన్నా. వెంటనే ప్రతిఘటించా. ఆ వ్యక్తిపై కోప్పడ్డాను. సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన ‘గార్గి’ ఇలాంటి ఘటన గురించే ప్రస్తావిస్తుంది. ఆ చిత్రానికి నేను నిర్మాతగా వ్యవహరించాను. ఇలాంటి చిత్రాలు సమాజంలో జరిగే కొన్ని సంఘటనలపై అవగాహన కల్పిస్తుంటాయి’’ అని ఆమె తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం
-
Movies News
Pathaan: ‘వైఆర్‌యఫ్ స్పై యూనివర్స్’లో ‘పఠాన్’ నంబరు 1.. కలెక్షన్ ఎంతంటే?
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!