Ajay Bhupathi: ఉత్తమ దర్శకుడిగా అజయ్‌ భూపతి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌

తాను ఉత్తమ దర్శకుడిగా ఎంపికైనట్లు అజయ్‌ భూపతి సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. అది ఏ అవార్డు అంటే?

Published : 16 Apr 2024 20:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అజయ్‌ భూపతి (Ajay Bhupathi) ఉత్తమ దర్శకుడిగా 8వ ‘ఇండియన్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ (Indian World Film Festival) అవార్డుకు ఎంపికయ్యారు. ‘మంగళవారం’ (Mangalavaram) సినిమాకి గాను ఆయన ఈ పురస్కారం దక్కించుకున్నారు.  ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తంచేశారు. జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘మినీ బాక్సాఫీస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌’లో ఇండియన్‌ వరల్డ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఒకటి.

‘ఆర్‌ఎక్స్‌ 100’తో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా విశేష క్రేజ్‌ సొంతం చేసుకున్నారు అజయ్‌. రెండో సినిమా ‘మహాసముద్రం’తో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. మూడో చిత్రం ‘మంగళవారం’తో మరోసారి తన సత్తా చాటారు. గోదావరి జిల్లాలోని ఓ గ్రామం చుట్టూ అల్లుకున్న ఈ కథలో పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) ప్రధాన పాత్ర పోషించారు. శైలు పాత్రలో ఒదిగిపోయి, ప్రశంసలు పొందారు. ప్రియదర్శి, నందిత శ్వేత, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఈ సినిమా గతేడాది నవంబరులో విడుదలై, బాక్సాఫీసు వద్ద విజయాన్ని అందుకుంది. ‘జైపుర్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ఉత్తమ నటి, బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌, బెస్ట్‌ ఎడిటింగ్‌, బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ విభాగాల్లో ఈ సినిమా అవార్డులు దక్కించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని