Akira: పవర్‌స్టార్ కొత్త ప్రాజెక్ట్‌పై అకీరా ఆనందం.. అడివి శేష్ కామెంట్స్ వైరల్
పవన్‌కల్యాణ్ - సుజిత్ కాంబోలో ఓ సినిమా పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ఆదివారం ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించగా.. దీనిపై అడివి శేష్ స్పందించారు.
హైదరాబాద్: తన తండ్రి, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కొత్త ప్రాజెక్ట్ విషయంలో అకీరా నందన్ (Akira) ఆనందంగా ఉన్నాడని, ఈ సినిమా కోసం అతడు ఎదురుచూస్తున్నాడని నటుడు అడివి శేష్ (Adivi Sesh) తెలిపారు. ‘హిట్-2’ (HIT 2) ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శేష్.. తన మిత్రుడు సుజిత్ (Sujeeth), పవన్‌తో సినిమా చేయడంపై స్పందిస్తూ.. ‘‘దాదాపు మూడు సంవత్సరాల తర్వాత సుజిత్‌కు సరైన ప్రాజెక్ట్ కుదిరింది. ‘సాహో’ (Sahoo) తర్వాత ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ సుజిత్‌తో సినిమా చేయడానికి వెంటపడ్డారు. కానీ, అతడు అంగీకరించలేదు. తెలుగులోనే సినిమా చేయాలనుకుంటున్నట్టు వాళ్లతో చెప్పాడు. అలా, తనకెంతో ఇష్టమైన హీరోతో ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. ఈ ప్రాజెక్ట్ విషయంలో అకీరా ఆనందంగా ఉన్నాడు. సినిమా కోసం తను ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌పై రామ్‌చరణ్, ప్రభాస్, మనోజ్ స్పందించారు. సినిమా మరోస్థాయిలో ఉండనుందని వాళ్లు ఆశాభావం వ్యక్తం చేశారు. టీమ్‌కు అభినందనలు తెలిపారు.
‘సాహో’ తర్వాత సుజిత్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రమిది. పవర్‌స్టార్ హీరోగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఇది నిర్మితం కానుంది. ఇందులో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉండొచ్చని కాన్సెప్ట్ పోస్టర్‌ని ఆధారంగా చేసుకుని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Gurugram: ‘నేనేం తప్పు చేశాను.. నాకెందుకు ఈ శిక్ష’... 14 ఏళ్ల బాలికపై దంపతుల పైశాచిక దాడి!
-
Politics News
MLC Kavitha: జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని మోదీ: ఎమ్మెల్సీ కవిత
-
Sports News
IND vs AUS: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో అశ్విన్.. ‘100’ క్లబ్లో పుజారా
-
General News
CBI: ఎమ్మెల్యేలకు ఎర కేసు వివరాలివ్వండి.. సీఎస్‌కు ఆరోసారి లేఖ రాసిన సీబీఐ
-
India News
Earthquake: తుర్కియేలో భారతీయులు సేఫ్.. ఒకరు మిస్సింగ్
-
Crime News
Hyderabad: బామ్మర్ది ఎంత పనిచేశావ్.. డబ్బు కోసం ఇంత బరితెగింపా?