Akshay Kumar: తనయుడి తెరంగేట్రంపై స్పందించిన అక్షయ్‌ కుమార్‌.. ఏమన్నారంటే?

తన కుమారుడి తెరంగేట్రంపై బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ స్పందించారు.

Published : 21 May 2024 23:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గ్యాప్‌ లేకుండా నటిస్తూ వరుస సినిమాలతో ప్రేక్షకులకు ఎప్పుడూ దగ్గరగా ఉండే బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ (Akshay Kumar). గతేడాది మూడు చిత్రాలతో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఆయన ఈ ఏడాది ఇప్పటికే ‘బడే మియా ఛోటే మియా’తో సందడి చేశారు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా పాల్గొన్న ఓ షోలో ఆ సినిమా విశేషాలతోపాటు తన కుమారుడు ఆరవ్‌ (Akshay Kumar Son Aarav) గురించి కొన్ని సంగతులు పంచుకున్నారు. తన కుమారుడికి లగ్జరీ లైఫ్‌ ఇష్టం ఉండదని, చాలా సింపుల్‌గా ఉంటాడని తెలిపారు. లండన్‌లో చదువుకునేందుకు పదిహేనేళ్ల వయసులో వెళ్లాడని చెప్పారు. 

ఈ క్రమంలో హోస్ట్‌.. ఆరవ్‌ తెరంగేట్రం గురించి అడగ్గా.. ‘‘చిత్ర పరిశ్రమలోకి రావాలని తాను అనుకోవట్లేదు. ఫ్యాషన్‌ రంగంపై ఆసక్తిగా ఉన్నాడు. ‘నీ జీవితం నీ ఇష్టం. నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేయ్‌’ అని చెప్పా’’ అని అన్నారు. ‘సింగమ్‌ అగైన్‌’, ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’ తదితర చిత్రాల్లో అక్షయ్‌ నటిస్తున్నారు. టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టు ‘కన్నప్ప’ (Kannappa)లో ఆయన కీలక పాత్ర పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని