Akshay Kumar: గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’.
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. మానుషి చిల్లర్, అలయా ఎఫ్ కథానాయికలు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇటీవల ట్రైలర్‌తో అదరగొట్టిన సినిమా అంతకుమించి ఉండనుందని అన్నారు అక్షయ్. తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న ఆయన కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.
- నేను ఒకే రకమైన జానర్ సినిమాలకు కట్టుబడి ఉండను. చేసిన చిత్రాలకు విజయం వచ్చినా రాకపోయినా భిన్నమైన జానర్లలో నటిస్తూ ప్రేక్షకులను అలరించడానికే ఇష్టపడతా. నా సినీ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి ఏ అపజయం నన్ను ఆపలేదు. సామజిక అంశాలతో కూడిన సినిమాలు, వినోదం, యాక్షన్, కుటుంబ కథా చిత్రాలు..ఇలా ప్రతీ జానర్ ప్రయత్నించాను. నాకు కథ నచ్చితే ఏ జానర్ అనేది ఆలోచించకుండా నటిస్తా. విభిన్న రకాల సినిమాలు చేస్తూనే ఉంటా.
- యాక్షన్, కామెడీ చిత్రాలు నేను బాగా చేస్తానని ప్రేక్షకులు ఎన్నో సార్లు చెప్పారు. కానీ నేనెప్పుడూ అలాంటి సినిమాలే చేస్తే నాతో పాటు, సినీ ప్రియులు కూడా విసుగు చెందుతారు. కొత్తగా ప్రయత్నించే క్రమంలో ‘టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథా’, ‘ప్యాడ్ మ్యాన్’, ‘ఎయిర్‌లిఫ్ట్’ లాంటి చిత్రాలు చేశా. ఆ సమయంలో ఎన్నో విమర్శల్ని ఎదుర్కొన్నా. కొందరికి ఆ సినిమాలు నచ్చాయి. అలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నావని కొందరు ప్రశ్నించారు.
- చిత్రపరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్కరికీ జయాపజయాలు సహజం. నా సినీ ప్రయాణంలోను ఎన్నో చవిచూశాను. నా జీవితంలో వరుసగా పదహారు ఫ్లాప్‌లను చూశాను. అయినా భయపడలేదు. అభిమానులను అలరించేందుకు కష్టపడుతూనే ఉన్నా. ఎన్నో కష్టాలను ఎదుర్కొని చేసిన సినిమాల్లో ‘బడే మియా ఛోటే మియా’ కూడా ఒక్కటి. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నా కాలికి గాయం అయ్యింది. అయినా షూటింగ్ పూర్తి చేశాం. చిత్రబృందం పడిన శ్రమకు ఫలితం ఈ సినిమా విజయమే అని నా అభిప్రాయం.
- ఈ సినిమా ద్వారా నాకు టైగర్ ష్రాఫ్ రూపంలో ఓ మంచి స్నేహితుడు దొరికాడు. తనని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఏ సమయంలో ఏది చేయాలో అదే చేస్తాడు. ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాడు. ప్రతినాయకుడిగా కనిపించిన పృథ్వీరాజ్ చాలా మంచి నటుడు. తనతో పని చేయడం ఎంతో సరదాగా అనిపించింది. మానుషి, అలయా చాలా బాగా నటించారు. ఇద్దరి నటన అద్భుతం. అలీతో కలిసి పని చేయటం గర్వంగా ఉంది.
- హాలీవుడ్లో వచ్చిన ‘బ్యాడ్ బాయ్స్’ తరహాలో ఉంటుంది ఇందులోని యాక్షన్. అందుకు తగ్గ వినోదాన్ని కూడా పంచుతుంది. అలీ ఈ కథ మాకు చెప్పినప్పుడే ఆశ్చర్యపోయాము. ఇందులో పృథ్వీరాజ్ కూడా భాగమవుతాడని తెలిశాక మరింత మజా వచ్చింది. మాస్క్ ధరించి, కొత్త లుక్‌లో కనిపించే ఈయనతో యాక్షన్ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూశాము.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఇందులో ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అతిథి పాత్ర పోషించడంపై నాగ్ అశ్విన్ స్పందించారు. -
ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఫొటోలు పంచుకున్న ఉపాసన
పారిస్‌లో జరుగుతోన్న ఒలింపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ పాల్గొని ఎంజాయ్ చేస్తోంది. -
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
‘యానిమల్’తో సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు నటి త్రిప్తి దిమ్రీ (Triptii Dimri). తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్ పార్క్’ గురించి స్పందించారు. -
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
ప్రేక్షకుల ఆదరణ జాతీయ అవార్డు కంటే గొప్పదని ‘12th ఫెయిల్’ నటుడు విక్రాంత్ మస్సే పేర్కొన్నారు. -
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్‌లో రకుల్‌ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్‌పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్‌తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల