Bade Miyan Chote Miyan: కెరీర్‌లో వరుసగా 16 ఫ్లాప్‌లు చూశా: అక్షయ్‌ కుమార్‌

తన కెరీర్‌లో వరుసగా 16 సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయని ‘బడేమియా ఛోటేమియా’ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలో అక్షయ్‌ కుమార్‌ తెలిపారు.

Published : 27 Mar 2024 00:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్ కథానాయకులు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), టైగర్‌ ష్రాఫ్‌ (Tiger Shroff) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బడేమియా ఛోటేమియా’ (Bade Miyan Chote Miyan). దేశభక్తి నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా అలీ అబ్బాస్‌ జాఫర్ దీనిని తెరకెక్కిస్తున్నారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. మానుషి చిల్లర్‌, అలయా ఎఫ్‌, సోనాక్షి సిన్హా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్‌ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ వేడుకలో అక్షయ్‌ కుమార్‌ మాట్లాడారు.

‘‘మేమందరం సినిమాలు చేస్తాం కానీ, ఫలితాన్ని నిర్ణయించలేం. అది ఆడియన్స్‌ అభిప్రాయం పై ఆధారపడి ఉంటుంది. నా కెరీర్‌లో వరుసగా 16 ఫ్లాప్‌లు చూశాను. సక్సెస్‌ అయినా లేకున్నా ప్రేక్షకుల్ని అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎప్పుడూ విభిన్నమైన కథలను ఎంపిక చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తాను. ఈ మధ్యన నేను కామెడీ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నాని అంటున్నారు. అలాంటిదేం లేదు. కథ నచ్చితే సినిమా చేస్తాను. ఒకే జోనర్‌లో సినిమాలు చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు. ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తాను. కామెడీ, యాక్షన్‌, రొమాంటిక్‌ వంటి అన్ని జోనర్‌ చిత్రాల్లోనూ నటిస్తాను. ‘బడేమియా ఛోటేమియా’ కోసం చాలా కష్టపడ్డాం. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని, విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం’’ అని అక్షయ్‌ కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని