Alia Bhatt: అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్‌

హీరోయిన్‌ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఆఫ్‌ 2024’లో చోటు దక్కించుకున్నారు.

Published : 17 Apr 2024 19:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ అలియాభట్‌ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. టైమ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన ‘100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఆఫ్‌ 2024’ (ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు) జాబితాలో (Times 100 most influential people) చోటు దక్కించుకున్నారు. గతేడాది ఈ జాబితాలో సినీ పరిశ్రమ నుంచి రాజమౌళి, షారుక్‌ఖాన్‌లు మాత్రమే చోటుదక్కించుకున్నారు. ఈ సంవత్సరం అలియా ఉండడంతో ఆమెకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

హాలీవుడ్‌ దర్శకుడు టామ్ హార్పర్ కూడా అలియాను ఉద్దేశిస్తూ పోస్ట్‌ పెట్టారు. ఆమె నటన చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ‘‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ సినిమా కోసం అలియాను మొదటిసారి కలిశాను. ఈ చిత్రంతో ఆమెను హాలీవుడ్‌కు పరిచయం చేశాను. పెద్ద హీరోయిన్‌ అయినప్పటికీ సెట్‌లో చాలా సరదాగా ఉండేది. సన్నివేశం బాగా రావడం కోసం రిస్క్‌ తీసుకోవడానికి కూడా వెనుకాడదు. ఎమోషనల్‌ సీన్స్‌లో అద్భుతంగా నటించింది. ప్రతీ సన్నివేశానికి తనదైన శైలిలో మెరుగులు దిద్దుతుంది. ఆమె నిజంగా ఇంటర్నేషనల్‌ స్టార్‌’’ అని ప్రశంసించారు. అలియా ప్రస్తుతం ‘లవ్‌ అండ్‌ వార్‌’లో నటిస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కుతోన్న ప్రేమకథా చిత్రమిది. ఇందులో విక్కీ కౌశల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె గాయకురాలి పాత్రలో కనిపించనున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని