Pathaan: ఈ క్షణాలు ఇలాగే కొనసాగాలి.. ‘పఠాన్’ విజయంపై అలియా స్పందన
‘పఠాన్’ విజయంపై బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) స్పందించారు. ఇండస్ట్రీకి ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకున్నారు.
హైదరాబాద్: ఈ ఏడాది ప్రారంభంలోనే బాలీవుడ్‌కు మంచి విజయాన్ని అందించింది ‘‘పఠాన్’’(Pathaan). ఈ చిత్రం సాధించిన విజయంతో చిత్రబృందంతో పాటు బీటౌన్ అంతా సందడి వాతావరణం నెలకొంది. తాజాగా ఈ సినిమా రికార్డులపై అలియా భట్(Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) స్పందించారు. ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కలెక్షన్‌లను ‘పఠాన్’ సులువుగా దాటేయడంపై వాళ్లు మాట్లాడారు.
‘‘పఠాన్’ లాంటి బ్లాక్‌బాస్టర్‌ను ఇండస్ట్రీకి అందించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి చిత్రాలు మరిన్ని విడుదలవ్వాలి. ఇది భారతదేశం గర్వంచతగ్గ చిత్రంగా నిలిచిపోతుంది. ప్రతి ఒక్కరూ ఆనందించాల్సిన సమయం ఇది. ఈ క్షణాలు ఇలాగే కొనసాగాలి’’ అని అలియా అన్నారు. ఇక రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ ఈ విజయం ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పారు. ‘పఠాన్’ అందించిన జోష్‌లో ఉన్న షారుఖ్(Shah Rukh Khan) ‘‘ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ పొందుతోంది. ఈ విషయంలో దేవుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీనికి సహకరించిన ప్రజలకు, మీడియాకు నా కృతజ్ఞతలు’’ అని చెప్పారు. ‘పఠాన్’ విడుదల తర్వాత షారుఖ్ ఈ చిత్రబృందంతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీకి జైలు శిక్ష.. ఎంపీగా అనర్హుడవుతారా..?
-
Movies News
Vishwak Sen: ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్ తీస్తాను: విష్వక్ సేన్
-
Politics News
MLC Election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ విజయం
-
General News
TSRTC ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లో ‘డైనమిక్ ప్రైసింగ్’!
-
Crime News
TSPSC: పేపర్ లీకేజీ కేసు.. ముగ్గురికి 14 రోజుల రిమాండ్
-
Sports News
Virat Kohli-RCB: విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేస్తాడు: ఆకాశ్ చోప్రా