Allu Aravind: నా కోడలు స్నేహకు పని చేయాల్సిన అవసరం లేదు కానీ..: అల్లు అరవింద్‌

ప్రతి ఆడపిల్ల తన కుటుంబంతో కలిసి తప్పకుండా చూడాల్సిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’ (Writer Padmabhushan) అని అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind). సుహాస్‌ (Suhas) ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమా సక్సెస్‌మీట్‌ శనివారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అరవింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 05 Feb 2023 10:30 IST

హైదరాబాద్‌: తన తనయుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) సతీమణి, కోడలు స్నేహారెడ్డి (Sneha Reddy) గురించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్నేహకు  పని చేయాల్సిన అవసరం లేనప్పటికీ ఆమె చేస్తోందని తెలిపారు. ‘రైటర్‌ పద్మభూషణ్‌’ (Writer Padmabhushan) సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న ఆయన చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు. అనంతరం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘ఇంత వయసు వచ్చినా నేనింకా ఉత్సాహంగా ఉన్నానంటే దానికి కారణం ప్రతిరోజూ యువ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులను కలవడమే. వాళ్లే నా ఎనర్జీ. ‘రైటర్‌ పద్మభూషణ్‌’ చిత్రాన్ని మనం రిలీజ్‌ చేద్దామని ఓసారి వాసు, ధీరజ్‌ నాతో చెప్పారు. మొదట నేను అంతగా ఆసక్తి కనబర్చలేదు. కానీ, సినిమా చూశాక.. దీన్ని తప్పకుండా మనమే రిలీజ్‌ చేయాలనుకున్నాను. ఈ సినిమాలో ఓ అంశం నాకు ఎంతో నచ్చింది. ప్రతి ఆడపిల్లకు కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయని.. తల్లిదండ్రులు వాటిని గౌరవించాలని ఇది తెలియజేస్తుంది. కాబట్టి, ఆడపిల్లలందరూ తన కుటుంబంతో కలిసి ఈ సినిమా చూడాలి. ఈ చిత్రాన్ని చూసి ఇంటికి వెళ్లాక నా భార్యను.. ‘‘నువ్వు ఏం అవ్వాలనుకున్నావు’’ అని అడిగాను. అంతలా ఈ సినిమా నా మనసుకు చేరువైంది. ఆడపిల్లలు ఇంట్లో కూర్చొవడాన్ని అంగీకరించను. వాళ్లు కూడా తమ కాళ్ల మీద నిలబడాలనుకుంటాను. నా కోడలు స్నేహారెడ్డికి పని చేయాల్సిన అవసరం లేదు. తను ధనవంతుల ఇంట్లో పుట్టింది. పెద్ద స్టార్‌ని పెళ్లాడింది. అయినప్పటికీ తను పని చేస్తుంది’’ అని అల్లు అరవింద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని