Allu Aravind: త్వరలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలను కలుస్తాం: అల్లు అరవింద్‌

తెలంగాణలో కాంగ్రెస్‌ విజయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ (Allu Aravind) తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలను కలుస్తామని అన్నారు.

Updated : 04 Dec 2023 18:29 IST

హైదరాబాద్‌: తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) స్పందించారు. కాంగ్రెస్‌ విజయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు మాట్లాడారు. సినీ పరిశ్రమ తరఫున త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలను కలుస్తామన్నారు. గత ప్రభుత్వాలు సినీ పరిశ్రమను ఎంతో ప్రోత్సహించాయని, కాంగ్రెస్‌ కూడా అదే విధంగా చిత్ర పరిశ్రమకు అండగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

నిర్మాతల మండలి శుభాకాంక్షలు..

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కొడంగల్‌ నియోజకవర్గంలో విజయం సాధించిన రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని