Allu Arha: ‘జమల్‌కుడు’ పాటకు అల్లు అర్హ డ్యాన్స్‌.. ఫన్‌ ట్విస్ట్‌ ఇదే!

Allu Arha: ‘యానిమల్‌’లో ‘జమల్‌కుడు’ పాటకు అర్హ వేసిన డ్యాన్స్‌ వైరల్‌ అవుతోంది.

Published : 23 Feb 2024 16:26 IST

హైదరాబాద్‌: స్టార్‌ హీరో అల్లు అర్జున్‌ కుమార్తె అర్హకు సోషల్‌మీడియాలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కూతురితో కలిసి బన్ని చేసే హంగామాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తరచూ దర్శనమిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో ట్రెండ్‌ అవుతోంది. ఇటీవల వచ్చిన ‘యానిమల్‌’ మూవీలోని ‘జమల్‌ కుడు’ పాట యువతను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. సాంగ్‌లో మందు గ్లాస్‌ తలపై పెట్టుకుని బాబీ దేవోల్‌ వేసే స్టెప్‌లు బాగా ట్రెండ్‌ అయ్యాయి. ఇప్పుడు అదే పాటకు అర్హ కూడా స్టెప్పులేసింది. అయితే, గ్లాస్‌తో కాదండోయ్‌ తలపై ప్లేట్‌ పెట్టుకుని, నడుచుకుంటూ వస్తున్న వీడియో వైరల్‌ అయింది. ‘శాకుంతలం’ మూవీతో అర్హ వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని