Shah Rukh Khan: అల్లు అయాన్‌ సింగింగ్‌ను మెచ్చిన షారుక్‌.. బన్నీ ఏమన్నారంటే?

అల్లు అర్జున్‌ తనయుడు అయాన్‌ ఓ పాట పాడగా షారుక్‌ ఖాన్‌ మెచ్చుకున్నారు. 

Published : 26 Feb 2024 02:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌ (Allu Arjun) తనయుడు అయాన్‌ (Allu Ayaan) సింగింగ్‌ను షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) మెచ్చుకున్నారు. తాను నటించిన ‘డంకీ’ (Dunki) సినిమాలోని ‘లుట్‌ పుట్‌ గయా’ (Lutt Putt Gaya) పాటను పాడినందుకు థ్యాంక్స్‌ చెప్పారు. ఇదెక్కడ జరిగిందని అనుకుంటున్నారా? అయాన్‌ ఇటీవల కారులో ప్రయాణిస్తూ సరదాగా ఆ గీతాన్ని ఆలపించాడు. సదరు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘షారుక్‌ ఖాన్‌ యూనివర్స్‌ ఫ్యాన్‌ క్లబ్‌’ ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) ఖాతాలోనూ అది పోస్ట్‌ అయింది. షారుక్‌ వరకూ చేరగా ఆయన స్పందించారు.

‘నువ్వు ఫ్లవర్‌ అండ్‌ ఫైర్‌. ఇప్పుడు ‘శ్రీవల్లి’ (అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమాలోని పాట) పాటను మా పిల్లలతో ప్రాక్టీస్‌ చేయిస్తున్నా’ అని పేర్కొన్నారు. షారుక్‌ పోస్ట్‌పై అల్లు అర్జున్‌ (బన్నీ) ఆనందం వ్యక్తం చేశారు. ఆయనపై ప్రేమ కురిపిస్తూ లవ్‌ సింబల్‌ ఎమోజీ జోడించారు. ఓ అగ్ర హీరోకి మరో అగ్ర హీరో రిప్లై ఇవ్వడంతో ఇరువురి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి ఫొటోలను ఓకే ఫ్రేమ్‌లో సెట్‌ చేసి, ‘ఈ కాంబోలో సినిమా వస్తే బాగుంటుంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు