Allu Arjun Wax Statue: అల్లు అర్జున్‌ మైనపు విగ్రహం.. ఓపెనింగ్‌ ఎప్పుడంటే!

అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఓపెనింగ్‌ తేదీని (Wax Statue Opening Date) దుబాయ్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం నిర్వాహకులు వెల్లడించారు.

Published : 22 Mar 2024 18:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన నటనతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ మైనపు విగ్రహం (Allu Arjun Wax Statue) రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మకంగా భావించే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో బన్నీ మైనపు విగ్రహం సిద్ధమైంది. తాజాగా దీని ఓపెనింగ్‌ తేదీని నిర్వాహకులు వెల్లడించారు. దుబాయ్‌లోని మ్యూజియంలో మార్చి 28 రాత్రి 8 గంటలకు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. నిర్వాహకులు ఈ విషయాన్ని అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలో వెల్లడించారు. ఆ పోస్ట్‌ను అల్లు అర్జున్‌ రీ షేర్‌ చేసి తన అభిమానులతో పంచుకున్నారు. ఈ ఓపెనింగ్‌ కార్యక్రమం(Wax Statue Opening Ceremony) కోసం బన్నీ వచ్చేవారం దుబాయ్‌ వెళ్లనున్నారు.

గతంలో ఈ విషయంపై బన్నీ(Allu Arjun) మాట్లాడుతూ.. ‘‘ఇది ఒక రకంగా నాకొక ప్రత్యేకమైన అనుభూతిని అందించింది. చిన్నతనంలో టుస్సాడ్స్‌ మ్యూజియాన్ని(Madame Tussauds Museum) సందర్శించిన సందర్భాలున్నాయి. ఈ మ్యూజియంలో నా మైనపు విగ్రహాన్ని చూస్తానని ఎప్పుడూ ఊహించలేదు’’ అని ఆనందం వ్యక్తంచేశారు. సినిమా, క్రీడలతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు(Wax Statues) టుస్సాడ్స్‌ మ్యూజియంలో పొందుపరుస్తారు. అమితాబ్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, షారుక్‌ ఖాన్‌ వంటి సినీ ప్రముఖుల విగ్రహాలు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు వారితో పాటు ఈ ఐకాన్‌ స్టార్‌(Icon Star Allu Arjun) విగ్రహం కూడా కనిపించనుండడంతో ఆయన అభిమానులు సంతోషపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని