Allu sirish: 15 ఏళ్ల క్రితం అలా వెళ్లాం.. ఇప్పుడు గర్వంగా ఉందంటూ అల్లు శిరీష్‌ పోస్ట్‌

15 ఏళ్ల క్రితం టూరిస్ట్‌లుగా వెళ్లినచోటే అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఉండడం ఎంతో ఆనందంగా ఉందని అల్లు శిరీష్ పేర్కొన్నారు.

Published : 30 Mar 2024 00:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ స్టార్‌గా ఎదిగారు అల్లు అర్జున్‌. తాజాగా ఆయన మరో ఘనతను అందుకున్న విషయం తెలిసిందే. ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ (madame tussauds) మ్యూజియం- దుబాయ్‌లో ఆయన మైనపు విగ్రహం కొలువుదీరింది. దీంతో అభిమానులు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈసందర్భంగా అల్లు అర్జున్‌ భార్య స్నేహ, తమ్ముడు శిరీష్ పెట్టిన పోస్ట్‌లు వైరలవుతున్నాయి.

తన అన్నకు దక్కిన ఈ గౌరవంపై అల్లు శిరీష్‌ స్పందిస్తూ.. ‘‘15 ఏళ్ల క్రితం నేను, బన్నీ కలిసి ఇదే మ్యూజియంకు టూరిస్టులుగా వచ్చాం. అక్కడ ఉన్న మైనపు బొమ్మలతో ఫొటోలు తీసుకున్నాం. కానీ, అంత గొప్ప ప్లేస్‌లో మా కుటుంబానికి చెందినవాళ్ల విగ్రహం ఉంటుందని ఊహించలేదు. నీ సినీ ప్రయాణం చూస్తుంటే గర్వంగా ఉంది’’ అంటూ అల్లు అర్జున్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఐకాన్‌ స్టార్‌ మైనపు బొమ్మ దగ్గర నిల్చుని ఫొటోలు దిగిన స్నేహ వాటిని పంచుకుంటూ బన్నీ భార్యగా ఎంతో గర్వంగా ఉందన్నారు. ‘ఎక్కడైనా తనదైన ముద్రవేసే అల్లు అర్జున్‌.. ఇప్పుడు ఎప్పటికీ ఇలా మైనపు విగ్రహంలా శాశ్వతంగా ఆకర్షిస్తుంటారు. మార్చి 28 మా గుండెల్లో చిరకాలం గుర్తుండిపోతుంది’ అని రాసుకొచ్చారు. అలాగే తెలుగు సినిమా అల్లు అర్జున్‌ను ఎప్పటికీ మర్చిపోదని సాయి ధరమ్‌ తేజ్‌ శుభాకాంక్షలు చెప్పారు.

సినిమా, క్రీడలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మైనపు విగ్రహాలు(Wax Statues) టుస్సాడ్స్‌ మ్యూజియంలో పొందుపరుస్తారు. అమితాబ్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, షారుక్‌ ఖాన్‌ వంటి సినీ ప్రముఖుల విగ్రహాలను ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు వారితో పాటు ఈ ఐకాన్‌ స్టార్‌(Icon Star Allu Arjun) విగ్రహం కూడా కనిపిస్తుండటంతో ఆయన అభిమానులు సంతోషపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని