Kalki 2898 AD: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్‌.. అమితాబ్‌ బచ్చన్‌ పాత్ర ఇదే!

‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్‌ బచ్చన్‌ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ విడుదలైంది.

Published : 22 Apr 2024 00:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు (Amitabh Bachchan look glimpse) సంబంధించిన గ్లింప్స్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామనంటూ అమితాబ్‌ తనని తాను పరిచయం చేసుకునే దృశ్యాలు సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. ఇందులో ఆయన యంగ్‌ లుక్‌లోనూ (టెక్నాలజీ వినియోగంతో) కనిపించడం విశేషం.

ఇతిహాసాలతో ముడిపడిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌ (Deepika Padukone). ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. మే 9న విడుదల చేయాలని చిత్ర బృందం గతంలో ప్రకటించింది. కానీ, సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. న్యూ రిలీజ్‌ డేట్ త్వరలోనే ప్రకటిస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిపై చిత్ర బృందం ఇంకా స్పందించలేదు. తాజా ప్రచార వీడియోలోనూ విడుదల తేదీపై అప్‌డేట్‌ ఇవ్వలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని