Amitabh Bachchan: యుద్ధ భూమిలో అశ్వత్థామ

ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ కలయికలో రూపొందిన బహుభాషా చిత్రం ‘కల్కి 2898 ఎ.డి’ విడుదలకు సిద్ధమవుతోంది.

Published : 08 Jun 2024 01:15 IST

ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ కలయికలో రూపొందిన బహుభాషా చిత్రం ‘కల్కి 2898 ఎ.డి’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా శుక్రవారం ఈ సినిమా నుంచి అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌ కొత్త లుక్‌ విడుదల చేశారు. అందులో ఆయన నుదుటిపై ఓ దివ్య రత్నాన్ని ధరించి.. చేతిలో ఓ అస్త్రం పట్టుకుని యుద్ధ భూమిలో నిల్చొని కనిపించారు. ఆయన చుట్టూ కొందరు వ్యక్తులు నేలపై పడి ఉండగా.. తన వెనుక ఓ చిత్రమైన భారీ వాహనం ఆగి ఉండటం ఆసక్తికరంగా ఉంది. వినూత్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ కథతో ముస్తాబైన ఈ చిత్రం ఈ నెల 27న థియేటర్లలోకి రానుండగా.. ఈ నెల 10న ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఇందులో దీపిక పదుకొణె, కమల్‌హాసన్, దిశా పటానీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతమందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు