Thalaivar 170: రజనీ 170లో ఈ ముగ్గురు

‘నా 170వ సినిమా సామాజిక సందేశంతో కూడిన భారీ ఎంటర్‌టైనర్‌’ అని అంటున్నారు ప్రముఖ తమిళ కథానాయకుడు రజనీకాంత్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న 170 సినిమా చిత్రీకరణ మంగళవారం ప్రారంభమైంది.

Updated : 04 Oct 2023 13:55 IST

‘నా 170వ సినిమా సామాజిక సందేశంతో కూడిన భారీ ఎంటర్‌టైనర్‌’ అని అంటున్నారు ప్రముఖ తమిళ కథానాయకుడు రజనీకాంత్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న 170 సినిమా చిత్రీకరణ మంగళవారం ప్రారంభమైంది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై టీజే.జ్ఞానవేల్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ తాజాగా మొదలైంది అని రజనీ తెలిపారు. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, రానా దగ్గుబాటి, మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించనున్నట్లు నిర్మాణ సంస్థ ఎక్స్‌ ద్వారా అధికారికంగా ప్రకటించింది. రితికా సింగ్‌, మంజు వారియర్‌, దుషారా విజయన్‌ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. తమ నటనతో ఆకట్టుకునే ఇతర భాషా ప్రముఖులు ఈ సినిమాలో కనిపించనుండటంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని