Amitabh Bachchan: ఎంత వేగంగా గాయమైందో.. అలానే నయమవుతుంది: అమితాబ్
హీరో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ప్రస్తుతం తన గాయం నుంచి కోలుకుంటున్నారు. దీనిపై ఆయన ఓ స్ఫూర్తిమంతమైన పోస్ట్ పెట్టారు.
ముంబయి: స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) సినిమా చిత్రీకరణలో ఇటీవల గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆ గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ మేరకు తన బ్లాగ్‌లో స్ఫూర్తిమంతమైన నోట్ రాశారు. ‘‘ఇలాంటి సమయంలో ప్రతి మనిషికి రెండు ఛాయిస్‌లు ఉంటాయి. నాకు ఎందుకు ఇలా జరిగిందని విలపిస్తూ కూర్చోవడం.. రెండు ఎంత బాధ ఉన్నా దాన్ని అధిగమించడం. నేను ఎప్పుడూ రెండో మార్గాన్నే ఎంచుకుంటా. మన శరీరం గాయాన్ని తగ్గించే విధంగా తన పని తను చేస్తుంటుంది. ఎంత వేగంగా గాయమైందో.. అంతే వేగంగా నయమవుతుంది’’ అని తెలిపారు. అలాగే ప్రతి మనిషిలో లోపాలుంటాయని వాటిని అధిగమిస్తూ ముందుకు పోవాలని సూచించారు.
‘ప్రాజెక్ట్ కె’ (Project K) (వర్కింగ్ టైటిల్) చిత్రీకరణలో అమితాబ్ గాయపడిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన కుడివైపు పక్కటెముకలకు దెబ్బ తగిలింది. దీంతో ఆయన గత కొద్ది రోజులుగా ముంబయిలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రభాస్ సరసన దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!
-
World News
Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!