Amitabh Bachchan: అమితాబ్‌కు లతా మంగేష్కర్‌ పురస్కారం

పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు ఇవ్వనున్నట్లు మంగళవారం ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని వారు ఏర్పాటు చేశారు

Updated : 17 Apr 2024 12:08 IST

ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్‌ మంగేష్కర్‌ పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు ఇవ్వనున్నట్లు మంగళవారం ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని వారు ఏర్పాటు చేశారు. ఈ నెల 24వ తేదీన అమితాబ్‌కు పురస్కారాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. 2022లో ఈ పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు. గత ఏడాది ఆశా భోస్లేకు ఇచ్చారు. ఈ ఏడాది అమితాబ్‌కు ప్రకటించారు.

న్యూస్‌టుడే,ముంబయి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని