Tantra: ‘తంత్ర’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన ‘తంత్ర’ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది.

Published : 31 Mar 2024 18:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ నటి అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘తంత్ర’. దర్శకుడు శ్రీనివాస్‌ గోపిశెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. సలోని, ధనుష్‌ రఘుముద్రి, వంశీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మార్చి 15న థియేటర్‌లో విడుదలైన ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఆహాలో ఏప్రిల్‌ 5 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

కథేంటంటే: పల్లెటూరిలో జరిగే తాంత్రిక విద్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్నప్పుడే తల్లి రాజేశ్వరి (సలోని)ని పోగొట్టుకుని తండ్రి ఆదరణకు దూరమై నాన్నమ్మ వద్ద ఉంటుంది రేఖ(అనన్య). ఎవరిపై అయినా క్షుద్ర ప్రయోగాలు, చేతబడి చేసినా ఆ విషయం రేఖకు తెలుస్తుంది. ఆమెకు దెయ్యాలు కనిపిస్తాయి. ఆమెకు చిన్నప్పటి నుంచి పరిచయమున్న తేజ (ధనుష్‌ రఘుముద్రి)తో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారుతుంది. సరదాగా సాగిపోతున్న వారి జీవితాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. వింతగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. దానిని గమనించిన తేజ ఆమెపై క్షుద్ర ప్రయోగం జరిగిందేమోనని సందేహపడతాడు. ఎప్పుడో ఆ ఊరి నుంచి వెళ్లిపోయిన విగతి (వంశీ) తిరిగి రావడంతో రేఖకు కష్టాలు ఎదురవుతాయి. రేఖ తల్లి ఎవరు? ఆమె గతం ఏంటి? ఆమెకి దెయ్యాలు ఎందుకు కనిపిస్తాయి? విగతితో ఉన్న విభేదాలేంటి? చివరికి కథ ఏ మలుపు తిరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని