Anasuya: లీడర్‌ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

Published : 28 Mar 2024 00:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జనసేన పార్టీ కోసం ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు నటి అనసూయ (Anasuya) తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. జబర్దస్త్‌ ఎందుకు మానేయాల్సి వచ్చిందో చెప్పారు. అలాగే పొలిటికల్‌ పార్టీలపైనా స్పందించారు.

‘‘డేట్స్‌ సర్దుబాటుకాకపోవడం వల్లే జబర్దస్త్‌ మానేశాను. ఇప్పటికీ కుదిరినప్పుడల్లా సెట్స్‌కు వెళ్తుంటాను. నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు. ఒకవేళ నన్ను పొలిటికల్‌ పార్టీలు ప్రచారానికి పిలిస్తే వెళ్తాను. నాకు లీడర్స్‌ ముఖ్యం.. పార్టీలు కాదు. ఏ లీడర్‌ నచ్చితే ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను. వాళ్ల అజెండాలు నచ్చితే కచ్చితంగా మద్దతిస్తా. నామాట వినేవాళ్లు ఉండడం నా అదృష్టం. చెబితే వింటారు కదా అని స్టేజ్‌ మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు. ఏదైనా బాధ్యతగా చేయాలి. జనసేన లీడర్‌ నన్ను ప్రచారానికి పిలిస్తే వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నా’’ అన్నారు.

సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు గతంలో ఆమె డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయన చాలా పెద్దవారు. సినిమాల్లో నెగెటివ్‌ పాత్రల్లో ఆయన చేసినట్లు ఎవరూ చేయలేరు. నన్ను వాళ్ల ఇంట్లో మనిషిలా అనుకున్నారు. వాళ్ల భార్య, కూతురు ఎంతో నన్ను అలానే భావించారు. ఆయన కొంచెం పాతకాలం వ్యక్తి కాబట్టి నా డ్రెస్సింగ్‌ స్టైల్‌ నచ్చలేదు. నాపై ఉన్న చనువుతో నేను పొట్టి డ్రెస్‌లు వేసుకోవడం నచ్చలేదని ఆయన అభిప్రాయాన్ని చెప్పారంతే. దాన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది రకరకాలుగా రాశారు’’ అని స్పష్టతనిచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని