Anasuya: వయసును అడ్డుపెట్టుకుని అవమానిస్తాం: అనసూయ
ట్విటర్ వేదికగా మరోసారి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు నటి అనసూయ (Anasuya). తాజాగా ఆమె పెట్టిన పోస్ట్‌పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
హైదరాబాద్: సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అనసూయ (Anasuya) తాజాగా నెటిజన్లలో స్ఫూర్తి నింపేలా ఓ వీడియో షేర్ చేశారు. ‘కలలను నిజం చేసుకోవడానికి వయసును అడ్డు అని అనుకోకండి’ అంటూ ఉన్న ఈ వీడియోలో.. తన కలను సాకారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఓ వృద్ధుడు 102 ఏళ్ల వయసులో రన్నింగ్ రేస్‌లో పాల్గొంటాడు. ఆయనలోని స్ఫూర్తికి స్టేడియంలో ఉన్న వాళ్లందరూ చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తుంటారు. ఈ వీడియో చూసి ఫిదా అయిన అనసూయ.. దీనిని ట్విటర్ వేదికగా షేర్ చేస్తూ అద్భుతం అంటూ ప్రశంసించారు. ‘‘ఇక, నా దేశం, రాష్ట్రంలో వయసును ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్కరినీ హేళన చేస్తుంటాం’’ అంటూ ఆమె తన బాధను వెళ్లగక్కారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ‘వయసుకు తగినట్టుగా ప్రవర్తిస్తే ఆ పెద్దాయన లాగా ప్రశంసలు ఎదుర్కొంటారు. కానీ పక్షంలో విమర్శలు తప్పవ’ని అంటున్నారు. బుల్లితెర, వెండితెర వేదికగా ప్రేక్షకులను అలరిస్తోన్న అనసూయ ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో సోషల్‌మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. వయసును ఆధారంగా చేసుకుని గతంలో ఆమెపై ఎంతో మంది నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. తల్లిగా ఉండి ఇలాంటి దుస్తులు వేయడం ఏంటి? అంటూ ఆమెను ఎన్నోసార్లు విమర్శించారు. బుల్లితెరపై వ్యాఖ్యాతగా కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ ఇప్పుడు వరుస చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TS: గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు ధర్మాసనం నిరాకరణ
-
India News
Sharad Pawar: శరద్ పవార్‌ను బెదిరిస్తూ.. సుప్రియా సూలేకు వాట్సప్ మెసేజ్
-
Politics News
Ponguleti Srinivasa Reddy: త్వరలోనే పార్టీ చేరిక తేదీలు ప్రకటిస్తా: పొంగులేటి
-
Crime News
Crime News: శంషాబాద్‌లో చంపి.. సరూర్‌నగర్ మ్యాన్‌హోల్‌లో పడేశాడు..
-
Crime News
‘ఆమెది ఆత్మహత్య.. శ్రద్ధా ఘటన స్ఫూర్తితో ముక్కలు చేశా’: ముంబయి హత్య కేసులో ట్విస్ట్