Shahid Kapoor: అనీష్‌తో షాహిద్‌ చిత్రం

బాలీవుడ్‌లో విజయాలు తగ్గిపోయిన తరుణంలో ఈ ఏడాది ‘భూల్‌ భులయ్యా 2’తో మంచి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు అనీష్‌ బజ్మీ. ఆయన తదుపరి చిత్రాన్ని విక్కీ కౌశల్‌తో చేయాలనుకున్నారు.

Updated : 19 Nov 2022 06:55 IST

బాలీవుడ్‌లో విజయాలు తగ్గిపోయిన తరుణంలో ఈ ఏడాది ‘భూల్‌ భులయ్యా 2’తో మంచి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు అనీష్‌ బజ్మీ (Anees Bazmee). ఆయన తదుపరి చిత్రాన్ని విక్కీ కౌశల్‌తో చేయాలనుకున్నారు. కానీ అది ప్రస్తుతానికి సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు లేవని తెలుస్తోంది. అందుకే ఆయన షాహిద్‌కపూర్‌తో (Shahid Kapoor) సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘భూల్‌ భులయ్యా 2’ మంచి విజయం సాధించడం ఆనందంగా ఉంది. నా దర్శకత్వంలో సినిమా చేయడానికి షాహిద్‌ అంగీకారం తెలిపారు. సరైన కథను సిద్ధం చేసి వెంటనే సినిమాని మొదలుపెడతాం’’అని చెప్పారు అనీష్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని