Animal Park: యానిమల్‌ పార్క్‌ 2026లో..

‘యానిమల్‌’ సంచలన విజయంతో యావత్తు సినీ పరిశ్రమ దృష్టిని తనవైపునకు తిప్పుకున్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. బాక్సాఫీసు రికార్డు వసూళ్లతోపాటు విమర్శలూ ఎదుర్కొందీ చిత్రం.

Updated : 22 Apr 2024 12:07 IST

యానిమల్‌’ సంచలన విజయంతో యావత్తు సినీ పరిశ్రమ దృష్టిని తనవైపునకు తిప్పుకున్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. బాక్సాఫీసు రికార్డు వసూళ్లతోపాటు విమర్శలూ ఎదుర్కొందీ చిత్రం. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక జోడీగా నటించిన ఈ సినిమాకి కొనసాగింపుగా ‘యానిమల్‌ పార్క్‌’ రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్ర బృందం. ఈ సీక్వెల్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ.. తాజాగా ఆదివారం  ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘‘యానిమల్‌ పార్క్‌’ చిత్రీకరణను 2026లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మొదటి భాగం కన్నా మరింత భారీగా.. హింసాత్మకంగా.. ప్రేక్షకుల ఊహాలకు అందని యాక్షన్‌ సన్నివేశాలతో దీన్ని తీర్చిదిద్దుతున్నాన’ని చెప్పారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని