Anjali: బాలకృష్ణతో నాకు మంచి అనుబంధం ఉంది: నటి అంజలి

Eenadu icon
By Entertainment Team Published : 31 May 2024 08:08 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి అంజలితో బాలకృష్ణ దురుసుగా ప్రవర్తించారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు బాలకృష్ణ అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో అంజలిని (Anjali) ఆయన నెట్టేశారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. తాజాగా బాలయ్యతో తనకున్న అనుబంధం గురించి అంజలి పోస్ట్‌ పెట్టారు. దీంతో ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్‌ పడింది.

‘బాలకృష్ణ (Balakrishna) హాజరుకావడం వల్ల ‘గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ మరింత ఘనంగా జరిగింది. ఆయనంటే నాకు ఎంతో గౌరవం. నాతో ఆప్యాయంగా ఉంటారు. మేమిద్దరం ఎన్నో ఏళ్లుగా స్నేహంగా ఉంటున్నాం. ఈ సినిమా వేడుక సందర్భంగా బాలకృష్ణతో కలిసి మరోసారి వేదిక పంచుకోవడం ఆనందంగా ఉంది’ అని రాసుకొచ్చారు. ఈ ఈవెంట్‌లో వీళ్లిద్దరి మధ్య జరిగిన కొన్ని మూమెంట్స్‌కు సంబంధించిన వీడియోను పంచుకున్నారు.

బాలయ్యబాబు కూర్చొన్న దగ్గర ఏ బాటిల్‌ లేదు.. అదంతా సీజీ: నాగవంశీ

మరోవైపు ఈ విషయంపై నిర్మాత నాగవంశీ స్పందించారు. ఫొటోకు పోజు ఇచ్చేందుకు వెనక్కి జరగాలని బాలయ్య చనువుకొద్దీ అలా చేశారని అన్నారు. నలుగురు వ్యక్తులు ఉన్నప్పుడు తమకున్న పరిచయం, చనువును బట్టి అలా ఎవరైనా చేస్తారని చెప్పారు. ఆ చర్యకు ముందూ.. వెనక ఉన్న పూర్తి వీడియోను చూడకుండా ఇలాంటి వాటిని ప్రచారం చేయడం తగదన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ, అంజలి హైఫై అంటూ చేతులతో చప్పట్లు కొడుతున్న దృశ్యాన్ని ఎవరూ చూపించలేదని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని