War 2: ‘వార్‌-2’లో మరో తెలుగు నటుడు.. ఆ పాత్రలోనేనా!

‘వార్‌-2’లో మరో తెలుగు నటుడు భాగమైనట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు తండ్రిగా ఆయన కనిపించనున్నారట.

Published : 01 Apr 2024 14:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘వార్‌ -2’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రానున్న ఈ స్పై థ్రిల్లర్‌ కోసం ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. తాజాగా మరో న్యూస్‌ తెలుగు ఆడియన్స్‌ను ఆకర్షిస్తోంది.

ఈ భారీ యాక్షన్‌ సినిమాలో మరో తెలుగు నటుడు భాగమైనట్లు తెలుస్తోంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో విలన్‌గా ఫుల్ బిజీగా మారిన జగపతి బాబు (Jagapathi Babu) ‘వార్‌-2’లో కీలకపాత్రలో కనిపించనున్నారట. ఎన్టీఆర్‌కు తండ్రిగా ఆయన నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టోరీకి ఈ పాత్ర మరింత పవర్‌ను ఇస్తుందంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రంలో హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ల మధ్య యాక్షన్‌ సన్నివేశాలు హోరాహోరీగా ఉండనున్నాయి. దీని షూటింగ్‌ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్‌ ఇండియన్‌ రా ఏజెంట్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ‘దేవర’ షూటింగ్‌ పూర్తికాగానే ఎన్టీఆర్‌ ‘వార్‌-2’లో జాయిన్‌ కానున్నారు.

‘దేవర’ విషయానికొస్తే.. ఎన్టీఆర్‌(NTR), దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) కాంబినేషన్‌లో యాక్షన్‌ డ్రామాగా రూపొందుతుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ తెలుగు తెరకు పరిచయమవుతుండగా, సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కీలక పాత్రలో శ్రీకాంత్‌ కనిపించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని