Anurag Kashyap: ఆనాడు హీరో విక్రమ్‌ ఏమీ స్పందించలేదు: అనురాగ్‌ కశ్యప్‌

కెన్నెడీ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌. ఈసినిమా కోసం తాను విక్రమ్‌ను తీసుకోవాలని అనుకున్నట్లు చెప్పారు.

Updated : 22 May 2023 13:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన తదుపరి ప్రాజెక్ట్‌ ‘కెన్నెడీ’ (Kennedy) ప్రదర్శనలో భాగంగా తాజాగా కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొన్నారు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap). రాహుల్‌ భట్‌, సన్నీలియోనీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను అక్కడి మీడియాతో పంచుకున్నారు. దక్షిణాది నటుడు చియాన్‌ విక్రమ్‌ (Vikram)ను దృష్టిలో ఉంచుకునే తాను ఈ కథను రాసుకున్నానని ఆయన చెప్పారు. విక్రమ్‌కు బదులు రాహుల్‌తో సినిమా చేయడానికి గల కారణాన్ని తెలిపారు.

‘‘ఈ కథను రాస్తున్నప్పుడు నా మైండ్‌లో విక్రమ్‌ మాత్రమే ఉన్నారు. ఆయన్ని దృష్టిలో ఉంచుకునే ఈ కథను సిద్ధం చేశాను. విక్రమ్‌ అసలు పేరు కెన్నెడీ. అందుకే ఈ ప్రాజెక్ట్‌కు ‘కెన్నెడీ’ అనే పేరు పెట్టాను. కథ పూర్తయ్యాక విక్రమ్‌ను కలిసి స్టోరీ లైన్‌ చెప్పాను. కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అలా, ఓసారి నేను రాహుల్‌భట్‌ను కలిసి కథ ఆయన చేతికి ఇచ్చాను. కథ చదువుతున్నసేపు ఆయన కనబరిచిన ఆసక్తి నాకెంతో నచ్చింది. ‘‘ఇందులో ఎవరు నటిస్తున్నారు?’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘మీకు ఓకే అంటే ఈ సినిమాలో మీరే ప్రధాన పాత్రలో కనిపిస్తారు. కాకపోతే దీని కోసం మీరు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది’’ అని చెప్పాను. సుమారు ఎనిమిది నెలలపాటు ప్రాజెక్ట్‌లన్నీ పక్కనపెట్టేసి దీని కోసం ఆయన వర్క్‌ చేశారు’’ అని అనురాగ్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని