Anurag Kashyap: నాతో మాట్లాడాలంటే ఫీజు చెల్లించాలి: అనురాగ్‌ కశ్యప్‌

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 23 Mar 2024 17:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనతో మాట్లాడాలంటే ఫీజు చెల్లించాలంటున్నారు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap). ఉచితంగా సలహాలిస్తూ ఉండటానికి తానేమీ స్వచ్ఛంద సంస్థను కాదన్నారు. ‘‘చిత్ర పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన వారికి సలహాలు, సూచనలు ఇస్తూ సమయం వృథా చేసుకున్నా. ఇప్పటినుంచి అలా కాదు. మేము తెలివైనవాళ్లం, ప్రతిభ ఉన్నవాళ్లం అని భావించే వారితో మాట్లాడుతూ కాలయాపన చేయను. ఏ పని ఫ్రీగా చేయను, ఎవరినీ ఊరికే కలవను. ప్రతి దానికి ఒక రేటు నిర్ణయిస్తున్నా. నన్ను కలవాలన్నా, నాతో మాట్లాడాలన్నా ఫీజు చెల్లించాలి. పదిహేను నిమిషాలకు రూ.లక్ష, అర గంటకు రెండు లక్షలు, గంటకు రూ.5 లక్షలు వసూలు చేస్తాను.  మొత్తం ఒకేసారి చెల్లించాలి. మేము డబ్బులు ఇవ్వలేం, టెక్ట్స్‌ మెసేజ్‌ చేస్తాం అనే వాళ్లు నాకు దూరంగా ఉండండి. తక్కువ టైమ్‌లో విజయం సాధించాలని షార్ట్‌కట్స్‌ వెతుక్కుంటూ వచ్చే వాళ్లని చూసి విసిగిపోయాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని అనురాగ్‌ కశ్యప్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు.  దీనిపై స్పందించిన ఆయన కుమార్తె ఆలియా.. నీకు చూపించమని నాకు స్క్రిప్ట్‌లు పంపుతున్న ప్రతీఒక్కరికీ ఈ మెసేజ్‌ ఫార్వర్ఢ్‌ చేస్తాను అని రిప్లై ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని