Aparna Das: పెళ్లి చేసుకోనున్న ‘ఆదికేశవ’ నటి.. ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ నటుడు..?

సినీ రంగంలో మరో నటీనటులు జంట కాబోతున్నారు. ‘ఆదికేశవ’ నటి, మంజుమ్మెల్‌ బాయ్స్‌ నటుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Updated : 03 Apr 2024 15:02 IST

ఇంటర్నెట్‌డెస్క్: ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’తో ఇటీవల విజయాన్ని అందుకున్నారు నటుడు దీపక్‌ పరంబోల్‌. త్వరలోనే ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నట్లు తెలుస్తోంది. మలయాళీ యువ నటి, ‘డాడా’ ఫేమ్‌ అపర్ణాదాస్‌ను ఆయన వివాహం చేసుకుంటున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏప్రిల్‌ 24న వడక్కంచెరిలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుక జరగనుందని సమాచారం. ఈమేరకు వివాహ ఆహ్వాన పత్రిక నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు కాబోయే జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

‘నాన్‌ ప్రకాశన్‌’తో నటిగా తెరంగేట్రం చేశారు అపర్ణాదాస్‌. 2019లో విడుదలైన ‘మనోహరమ్‌’ హీరోయిన్‌గా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే దీపక్‌ పరంబోల్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి అది ప్రేమగా మారిందని.. పెద్దల అంగీకారంతో ఇప్పుడు వివాహం చేసుకుంటున్నారని తెలుస్తోంది. అపర్ణ తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. ఇటీవల విడుదలైన ‘ఆదికేశవ’లో ఆమె కీలక పాత్ర పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని