ARM Teaser: అలాంటి కథలు రాత్రి వేళ చెప్పకూడదమ్మా.. ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘ఏఆర్‌ఎం’ టీజర్‌

పాన్‌ ఇండియా సినిమా ‘ఏఆర్‌ఎం’ టీజర్‌ విడుదలైంది. టొవినో థామస్‌, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రమిది. టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Published : 19 May 2023 23:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మలయాళ నటుడు టొవినో థామస్‌ (Tovino Thomas) హీరోగా దర్శకుడు జితిన్‌ లాల్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఏఆర్‌ఎం’ (అజయంతే రంధం మోషణమ్‌) (ARM). కృతిశెట్టి (Krithi Shetty) కథానాయిక. ఐశ్వర్య రాజేశ్‌, సురభి లక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ పాన్‌ ఇండియా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ (ARM Teaser)ని విడుదల చేసింది. ‘అమ్మమ్మా.. నాకు మణియనన్‌ కథ చెబుతావా’ అని మనవరాలు అడిగే సన్నివేశంతో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఆ అమ్మమ్మ చెప్పిన సమాధానం వింటే ఈ సినిమా కరుడు గట్టిన దొంగ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు అర్థమవుతోంది. విజువల్స్‌, నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. డబ్బింగ్‌ చిత్రం ‘మిన్నల్‌ మురళి’తో టొవినో థామస్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని