Ashika Ranganath: విశ్వంభర కోసం ఆషిక

కథానాయకుడు చిరంజీవి.. దర్శకుడు వశిష్ఠ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Published : 25 May 2024 01:05 IST

థానాయకుడు చిరంజీవి.. దర్శకుడు వశిష్ఠ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్రిష కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. కాగా, ఇప్పుడీ చిత్రంలోని ఓ ముఖ్య పాత్ర కోసం కన్నడ భామ ఆషికా రంగనాథ్‌ను రంగంలోకి దించింది చిత్ర బృందం. ఈ విషయాన్ని శుక్రవారం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ఇదొక భిన్నమైన సోషియో ఫాంటసీ యాక్షన్‌ అడ్వెంచర్‌. ఈ కథలో ఆషికా పాత్రకు చక్కటి ప్రాధాన్యమున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. చిరు ఇందులో భీమవరం దొరబాబు అనే పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి. ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు