Ayalaan: ఏలియన్‌తో దోస్తీ... మస్త్‌ ఖుషీ

ప్రేక్షకులకు ఎన్ని జానర్ల సినిమాలు వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాలంటే ఆసక్తి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అలాంటి సినిమాలకు ఇంకొంచెం విజువల్‌ ఎఫెక్ట్స్‌ జోడిస్తే అభిమానులకు పండగే.

Updated : 08 Oct 2023 13:40 IST

ప్రేక్షకులకు ఎన్ని జానర్ల సినిమాలు వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాలంటే ఆసక్తి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అలాంటి సినిమాలకు ఇంకొంచెం విజువల్‌ ఎఫెక్ట్స్‌ జోడిస్తే అభిమానులకు పండగే. అదే తరహాలో తమిళ కథానాయకుడు శివకార్తికేయన్‌ ‘అయలాన్‌’తో సందడి చేయనున్నారు. ఆర్‌.రవికుమార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం అది. ‘డెస్టినేషన్‌ ఎర్త్‌’ అనేది ఉపశీర్షిక. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను తాజాగా టాలీవుడ్‌ హీరో నాని సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు. ‘ఒక్కో పీరియడ్‌లో ఒక్కో ఎనర్జీ ఈ ప్రపంచాన్ని డామినేట్‌ చేసింది...వాతావరణంలో ఏర్పడిన ఈ ప్రమాదకరమైన మార్పులు భూమినే అంతం చేస్తాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు’ అంటూ మొదలైన ఈ టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. కళ్లు చెదిరే విజువల్‌ ఎఫెక్ట్స్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఎన్నో శక్తులున్న గ్రహాంతరవాసి ఆకాశం నుంచి భూమి మీదకు రావడం, దానితో హీరో స్నేహం చేయడం, కలిసి చిందులేయడం...ఆసక్తిగా ఉంది. అసలు ఆ ఏలియన్‌ భూమి మీదకు ఎందుకు వచ్చింది?...వాతావరణంలో ఏర్పడిన మార్పులేంటి? తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందేనని అంటున్నాయి సినీవర్గాలు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం: ఏఆర్‌. రెహామాన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని