Baahubali: The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. చిన్న కథతో రివ్యూ ఇచ్చిన ప్రశాంత్‌ నీల్‌

Eenadu icon
By Entertainment Team Published : 31 Oct 2025 13:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతం ‘బాహుబలి’. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపిన ఈ బ్లాక్‌బస్టర్‌ పదేళ్ల తర్వాత ‘బాహుబలి: ది ఎపిక్‌’ (Baahubali: The Epic) పేరుతో ప్రేక్షకుల ముందుకువచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రేక్షకులకు ఏ థ్రిల్‌ను పంచిందో.. ఇప్పుడు కూడా అలానే అలరిస్తోంది. తాజాగా ఈ సినిమాపై దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రివ్యూ ఇచ్చారు. చిన్న కథ రూపంలో పంచుకున్నారు.

ప్రశాంత్‌ నీల్‌ రివ్యూను ఆయన భార్య లిఖిత తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. ‘‘ఒక రోడ్డుకు మరమ్మతులు చేయాల్సి వచ్చింది. దీంతో అందరూ కలిసి ఓ కాంట్రాక్టర్‌ను పిలిచారు. ఆ కాంట్రాక్టర్‌ ఆ రోడ్డుకు మరమ్మతులు చేయడమే కాకుండా.. ఏకంగా దాన్ని 16 వరుసల హైవేగా మార్చేశాడు. ఆ రోడ్డు ఏదో కాదు.. పాన్‌ ఇండియా, ఆ కాంట్రాక్టర్‌ మరెవరో కాదు రాజమౌళినే’’ అంటూ జక్కన్న టాలెంట్‌ను ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) అభినందించారు. బాహుబలి టీమ్‌ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు. ఒక తరం కోసం ఈ టీమ్ అంతా ఎన్నో కలలు కన్నదని కొనియాడారు.

రెండు భాగాలను కలిపి రాజమౌళి (SS Rajamouli) ఒకే పార్ట్‌గా ‘బాహుబలి: ది ఎపిక్‌’ పేరుతో రీరిలీజ్‌ చేశారు. రెండు భాగాల్లో తొంభై నిమిషాల‌కు పైగా స‌న్నివేశాలను తొలగించి దీన్ని విడుదల చేశారు. అవంతిక లవ్‌స్టోరీ, పచ్చబొట్టేసిన పాట, ఇరుక్కుపో సాంగ్‌, కన్నా నిదురించరా సాంగ్‌, యుద్ధానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించారు. అన్ని మార్పులు చేసినప్పటికీ కథలో ఎక్కడా లోటు లేకుండా తన మార్క్‌ చూపారంటూ అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని