Akhanda 2: కథ సిద్ధం..
విజయవంతమైన చిత్రాలకు సీక్వెన్స్ రూపొందించడంపైనే మక్కువ చూపుతున్నారు దర్శకనిర్మాతలు. చాలారకాలుగా కలిసొచ్చే అవకాశం ఉండటంతో కొనసాగింపు చిత్రాలు విరివిగా రూపొందుతున్నాయి.
విజయవంతమైన చిత్రాలకు సీక్వెన్స్ రూపొందించడంపైనే మక్కువ చూపుతున్నారు దర్శకనిర్మాతలు. చాలారకాలుగా కలిసొచ్చే అవకాశం ఉండటంతో కొనసాగింపు చిత్రాలు విరివిగా రూపొందుతున్నాయి. ‘అఖండ’ విడుదల తర్వాత ‘అఖండ 2’ (Akhanda 2) ఆలోచన కూడా ఉందని ఇదివరకే దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) స్పష్టం చేశారు. కథానాయకుడు బాలకృష్ణ (Balakrishna) సైతం తాజాగా ఆ ప్రాజెక్టుపై స్పష్టతనిచ్చారు. భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ‘అఖండ’ సినిమా ప్రదర్శితమైన సందర్భంగా అక్కడే ‘అఖండ 2’ గురించి మాట్లాడారు. ‘‘కథ కూడా సిద్ధం చేశాం. ఎప్పుడు చేస్తామనే విషయంపైనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంద’’ని చెప్పారు బాలకృష్ణ. ఆయన ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ చిత్రం చేస్తున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో కలిసి ఓ సినిమా చేయనున్నారు. తన వారసుడు మోక్షజ్ఞని వచ్చే ఏడాది పరిచయం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు బాలకృష్ణ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్టీఆర్ కోసం మరో విలన్?
‘దేవర’గా థియేటర్లలో సందడి చేయనున్నారు ఎన్టీఆర్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
‘కె.జి.ఎఫ్’ ప్రపంచంలోకి అజిత్?
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ సరికొత్త కలయికకు రంగం సిద్ధం చేశారా? ‘కె.జి.ఎఫ్’ ప్రపంచంలోకి అగ్ర కథానాయకుడు అజిత్‌ను తీసుకొస్తున్నారా? అవుననే అంటున్నాయి తమిళ సినీ వర్గాలు. -
ఏ రెండు లవ్‌స్టోరీలు ఒకేలా ఉండవు
‘సుందరకాండ’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నారా రోహిత్. ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేశ్ నిమ్మలపూడి తెరకెక్కిస్తున్నారు -
వీర్... మేనికాల మధ్య రెండోసారి ప్రేమ చిగురిస్తే!
బాలీవుడ్లో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్న అగ్ర నటుడు సంజయ్‌దత్, కథానాయిక రవీనా టాండన్ కలయికలో రూపొందిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఘుడ్చఢీ’. -
1న సిటాడెల్ సర్ప్రైజ్
త్వరలో ‘సిటాడెల్:హనీ- బన్నీ’తో తనలోని యాక్షన్ కోణాన్ని సినీప్రియులకు రుచి చూపించడానికి సిద్ధమవుతోంది అందాల తార సమంత. -
వన్స్ మోర్ రెప్పల్ డప్పుల్..
వన్స్ మోర్ మోర్ మోర్... అంటూ మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఊరిస్తోంది ‘మిస్టర్ బచ్చన్’ పాట. రవితేజ, భాగ్య శ్రీ బోర్సే డాన్స్‌లోని హుషారు ఈ పాటకి మరింత ఊపు తెచ్చింది. -
యంత్రం ప్రేమించదు
జీవితానికి ఇన్సూరెన్స్ ఉంటుందని తెలుసు కాని, ప్రేమకి ఇన్సూరెన్స్ ఏంటనేది తెలియాలంటే ‘ఎల్ఐకే’(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) చూడాల్సిందే. -
సిద్ధమేనా... ఓ అందమైన రహస్యం కోసం
‘‘మన మధ్య ఉన్న ప్రేమ శాశ్వతమైనది. మనం ఎప్పటికీ ఇలాగే ఒకరికి తోడుగా మరొకరం ఉండాలని కోరుకుంటున్నా’’ అంటూ ఓ ప్రియురాలు తన ప్రియుడితో చెప్తుంది -
రెడ్ శారీలో కృతిశెట్టి ఇలా.. మాళవికా మోహనన్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘దేవర’ సాంగ్ అప్డేట్ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. ఏమన్నారంటే?
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. ఈ సినిమా సాంగ్ అప్డేట్ ఇచ్చారు శేఖర్ మాస్టర్.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
-
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్‌లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
-
డబ్బులు ఊరికే రావు.. మాటల మాయలో పడ్డారో.. ఇల్లు గుల్లే
-
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
-
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
-
చిట్టీల పేరుతో మోసం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, భర్త అరెస్టు