Dunki: తనకు తానే అర్పించుకునే ప్రేమికుడు హర్డీ

మరికొద్ది రోజుల్లో ‘డంకీ’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుక్‌ ఖాన్‌. తాప్సీ, విక్కీ కౌశల్‌, బొమన్‌ ఇరానీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ తెరకెక్కించారు.

Updated : 20 Dec 2023 11:20 IST

మరికొద్ది రోజుల్లో ‘డంకీ’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుక్‌ ఖాన్‌. తాప్సీ, విక్కీ కౌశల్‌, బొమన్‌ ఇరానీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ తెరకెక్కించారు. ఈ సినిమాలో హర్డీ అనే పాత్రలో కనిపించనున్నారు షారుక్‌. తాజాగా ఇందులోని ‘బందా’ అనే గీతాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు షారుక్‌. ‘ఇలాంటి ప్రేమికుడు ఎవరూ ఉండరు.. తన ప్రేమను బతికించుకోవడానికి తనను తానే అర్పించుకుంటాడు...’ అంటూ సాగే ఈ లిరిక్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాటని కుమార్‌ రచించగా.. దిల్జిత్‌ దొసాంజ్‌ పాడారు. ప్రీతమ్‌ బాణీలు సమకూర్చారు. హర్డీ పాత్ర, అతని ప్రపంచం గురించి తెలియజేస్తూ సాగిన ఈ పాట చివర్లో ‘నా దేశంలో నాకెలాంటి ఆపదా లేదు.. నా దేశం అలాగే ఉంటుంది. నాలాగే ఉంటుంది. ఇక్కడ ఉండటానికి నా మాతృదేశాన్ని తిట్టలేను’ అంటూ సాగే సంభాషణలు.. సినిమాలో అంతర్లీనంగా దేశభక్తి సైతం ఉంటుందనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని